ఇరాన్‌పై అమెరికా ఒత్తిడిని మరింత పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు ఆర్థికంగా లేదా ఇతర మార్గాల్లో సహాయం చేసే దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజాగా ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్.. ఇరాన్‌కు సహాయం చేసే కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని దాని మిత్రదేశాలను కోరారు. ఆర్థిక సంస్థలు, వ్యాపార సంస్థలు, విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ సంస్థల ద్వారా ఇరాన్‌కు ఎలాంటి ఆర్థిక సహాయం అందించినా సంబంధిత దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇరాన్‌కు మద్దతు ఇచ్చే దేశాల పేర్లను తాను ప్రత్యేకంగా వెల్లడించలేదని, అయితే సంబంధిత దేశాలకు తాము ఎవరిని ఉద్దేశిస్తున్నామో తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడానికి అమెరికా మిత్రదేశాలు తమకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
ఇరాన్‌ను ఆర్థికంగా బలహీనపర్చే లక్ష్యంతో అమెరికా ఇప్పటికే పలు చర్యలు చేపడుతున్నట్లు ట్రంప్ తెలిపారు. టెహ్రాన్‌కు నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అదే సమయంలో ఇరాన్‌కు అణ్వాయుధం ఉండకుండా చూడటం అమెరికా ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ట్రంప్ స్పష్టం చేశారు.
ట్రంప్ తాజా హెచ్చరికలతో ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న లేదా ఆ దేశంతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై అమెరికా తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
ఇరాన్‌కు సాయం చేస్తే తీవ్ర ఆర్థిక పరిణామాలు తప్పవు.. మిత్రదేశాలకు ట్రంప్ హెచ్చరిక
7
Published: 📅
Reported by: 🖊
Kanakadri