ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు ఇటలీకి చెందిన కొరియర్ డెల్లా సెరా పత్రిక వెల్లడించింది. విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్‌కు చెందిన కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ దాడి చేసిన అనంతరం, విమానం ఇంజిన్లను షట్‌డౌన్ చేసేందుకు అతడు ప్రయత్నించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.
పైలట్‌పై దాడి జరిగిన తర్వాత విమానం ఒక్క నిమిషంలోపే సుమారు 16 వేల అడుగుల మేర కిందకు దిగినట్లు పత్రిక తెలిపింది. సౌదీ ఎడారిలో విమానాన్ని కూల్చేందుకు కోపైలట్ ప్రయత్నించి ఉండవచ్చనే అనుమానాన్ని కూడా దర్యాప్తు అధికారులు వ్యక్తం చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా విమానం ఇంజిన్లకు ఇంధన సరఫరాను నిలిపివేసేందుకు కూడా ప్రయత్నం జరిగి ఉండవచ్చని వెల్లడించింది.
విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎమర్జెన్సీ లైట్లు వెలిగినట్లు రికార్డైన వీడియో ద్వారా గుర్తించినట్లు పత్రిక తెలిపింది. సాధారణంగా విమానం నేలపై ఉన్నప్పుడు లేదా అత్యవసరంగా ఖాళీ చేస్తున్న సమయంలో ప్రయాణికులకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ లైట్లను ఉపయోగిస్తారు. విమానం గాల్లో ఉన్న సమయంలో అవి వెలగడం అసాధారణంగా పరిగణించవచ్చని నిపుణులు పేర్కొన్నట్లు సమాచారం.
బోయింగ్ 737 విమానాలకు చెందిన ఇద్దరు కెప్టెన్ల అభిప్రాయం ప్రకారం, జనరేటర్లు లేదా ఇంజిన్లు షట్‌డౌన్ అయినప్పుడు మెయిన్ ఎలక్ట్రికల్ పవర్ కోల్పోయి ఎమర్జెన్సీ లైట్లు వెలిగే అవకాశం ఉంటుంది. కోపైలట్ ఇంధన నియంత్రణ స్విచ్‌లను ‘రన్’ నుంచి ‘కటాఫ్’ స్థానానికి మార్చాడా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో మరో షాకింగ్ విషయం.. ఇంజిన్లు షట్‌డౌన్ చేసేందుకు కోపైలట్ యత్నం?
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan