ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్రంలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసుల్లో మొత్తం 73 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 29గా నిర్ణయించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలను పరిశీలిస్తే.. సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసులో 21 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసులో 23 పోస్టులు, బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసులో 29 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 73 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు ఎంపిక సింగిల్ లెవెల్ ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు జీతం లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 9, 2026న ప్రారంభమవుతాయి. అభ్యర్థులు అక్టోబర్ 29, 2026లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు.. 73 ఉద్యోగాలు, రూ.1,15,500 వరకు జీతం
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk