ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను, ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రకాశం పంతులును స్మరించుకున్నారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణతో పాటు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం ఆయన వ్యక్తిత్వంలో కనిపించేదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జీవించిన ఆయన తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్యోద్యమంలో ప్రకాశం పంతులు చూపిన ధైర్యం ఆయనకు ‘ఆంధ్రకేసరి’ అనే బిరుదును తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బ్రిటిష్ తుపాకులకు ఎదురుగా నిలిచిన ఆయన సాహసాన్ని తెలుగు ప్రజలు ఇప్పటికీ స్ఫూర్తిగా గుర్తుచేసుకుంటారు.
మంత్రి నారా లోకేశ్ కూడా ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రకాశం పంతులు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.
ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని లోకేశ్ అన్నారు. ప్రజాసేవ, ధైర్యం, నిబద్ధత వంటి విలువలను ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రకాశం పంతుల జయంతి సందర్భంగా ఆయన చేసిన పోరాటాలు, ప్రజా సేవలను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులు అర్పిస్తున్నారు.
ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి.. చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళి
9
Published: 📅
Reported by: 🖊
Kanakadri