హైదరాబాద్‌లో ఓ యువకుడు సరదాగా చేసిన చిన్న ప్రాంక్ చివరకు అతడి అసలు వ్యవహారాన్ని పోలీసుల ముందు బయటపెట్టింది. కిడ్నాప్ చేశారంటూ ప్రియురాలికి పంపిన మెసేజ్ కారణంగా పోలీసులు ఫ్లాట్‌కు చేరుకోవడంతో రూ.30 లక్షల నగదు బయటపడింది.
కేపీహెచ్‌బీలోని ఇండిస్ వన్ సిటీలో సుమంత్, మనోజ్, గౌతమ్ అనే ముగ్గురు యువకులు కలిసి నివాసం ఉంటున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరి పరిసర ప్రాంతాలకు చెందినవారు. ఇటీవల ముగ్గురూ కలిసి విందు చేసుకుంటున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న సుమంత్ తనను కొందరు కిడ్నాప్ చేశారంటూ ప్రియురాలికి మెసేజ్ పంపాడు.
ఆ మెసేజ్‌ను నిజమని భావించిన యువతి ఆందోళనకు గురై వెంటనే 112కు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఫ్లాట్‌కు చేరుకుని ముగ్గురినీ విచారించారు. అనంతరం ఇంట్లో తనిఖీలు చేయగా ఓ సూట్‌కేసులో రూ.30 లక్షల నగదు కనిపించింది.
డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా యువకులు పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి మొబైల్ ఫోన్లను పరిశీలించారు. ఈ క్రమంలో సుమంత్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఆ రూ.30 లక్షలు బెట్టింగ్‌కు సంబంధించినవేనా? లేక హవాలా మార్గంలో తరలిస్తున్న నగదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని నగదు మూలం, ఫోన్ లావాదేవీలు, బెట్టింగ్ వ్యవహారంపై విచారణ కొనసాగిస్తున్నారు.
ఒక సరదా ప్రాంక్ మెసేజ్ చివరకు రూ.30 లక్షల నగదు, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కిడ్నాప్ అంటూ ప్రియురాలికి ప్రాంక్ మెసేజ్.. రూ.30 లక్షలతో దొరికిన యువకులు
13
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan