ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల కర్ణ్ శర్మ యూపీ టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్, మీరట్ మావెరిక్స్ మధ్య మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆగస్టు 25న లఖ్‌నవూ లెగ్ జట్టు ఆడే చివరి మ్యాచ్‌తో ఆటగాడిగా తన క్రికెట్ కెరీర్‌కు పూర్తిగా ముగింపు పలకనున్నాడు.
తన సుదీర్ఘ ప్రయాణానికి సహకరించిన కుటుంబ సభ్యులు, బీసీసీఐ, రైల్వేస్, యూపీసీఏ, ఆంధ్ర, విదర్భ క్రికెట్ అసోసియేషన్‌లకు కర్ణ్ శర్మ కృతజ్ఞతలు తెలిపాడు. ఇకపై క్రికెట్‌కు సంబంధించిన కోచింగ్, ఇతర బాధ్యతల్లో అందుబాటులో ఉంటానని వెల్లడించాడు.
దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణంకర్ణ్ శర్మ 2007-08 దేశవాళీ సీజన్‌లో ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఎ, టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తొలినాళ్లలో ఆల్‌రౌండర్‌గా కొనసాగిన అతడు.. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు.
2012-13 సీజన్ అతడి కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఆ సీజన్‌లో మూడు రంజీ మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనకు బీసీసీఐ బెస్ట్ అండర్-25 క్రికెటర్ అవార్డును అందుకున్నాడు.
ఐపీఎల్‌లోనూ కర్ణ్ శర్మకు మంచి గుర్తింపు లభించింది. 2014 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ.3.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ భారత ఆటగాడిగా నిలిచాడు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌లో కొనసాగిన కర్ణ్ శర్మ.. తన ప్రయాణాన్ని ముగిస్తూ కొత్త పాత్రల్లో క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించనున్నాడు.
కర్ణ్ శర్మ రిటైర్మెంట్.. దాదాపు 20 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan