హైదరాబాద్: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఫ్లడ్‌లైట్ స్థంభం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఫ్లడ్‌లైట్ స్థంభం కిందపడటంతో అక్కడ ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. స్థంభం పడటంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
మల్లారెడ్డి కాలేజీపై కేసు
ఈ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్‌లో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా ‘టాక్సిక్’ సినిమా చిత్ర యూనిట్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఫ్లడ్‌లైట్ స్థంభం ఏర్పాటు తదితర అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
భారీగా అభిమానులు, ప్రేక్షకులు హాజరయ్యే సినిమా కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్లు కీలకం. ఇలాంటి కార్యక్రమాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రమాదానికి అసలు కారణాలు, బాధ్యత ఎవరిదనే విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
‘టాక్సిక్’ ఈవెంట్‌లో ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీ, చిత్ర యూనిట్‌పై కేసు
4
Published: 📅
Reported by: 🖊
Banu Prakash