అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఆ దేశ దౌత్య కార్యాలయం వినూత్న రీతిలో స్పందించింది. జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా వేదికగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలోని ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ ట్రంప్‌ను వ్యంగ్యంగా టార్గెట్ చేసింది.
ఇరాన్ ఎంబసీ షేర్ చేసిన 58 సెకన్ల వీడియోలో భారీ తుపాకులు, రైఫిళ్లు, రక్షణ కవచాలతో హీరో, విలన్ గ్యాంగ్‌ల మధ్య జరిగే ఫైటింగ్ సన్నివేశం కనిపిస్తుంది. ఈ వీడియోను ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఉపయోగించింది.
“ఇరాన్‌ను ట్రంప్ అంతం చేస్తానంటున్నారు. కానీ ఇరాన్ బలహీనమైన దేశం కాదని ఆయనకు తెలుసు” అంటూ ఇరాన్ ఎంబసీ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. అమెరికా సినిమాలకు బదులుగా బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని కూడా పోస్టులో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ట్రంప్ ప్రసంగిస్తూ ఇరాన్ శాంతి ఒప్పందానికి రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒప్పందానికి రావడం లేదా మరిన్ని దాడులను ఎదుర్కోవడం అనే రెండు మార్గాలు మాత్రమే ఇరాన్ ముందు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ చేసిన సోషల్ మీడియా పోస్టు అంతర్జాతీయ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామంగా మారింది.
ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఎంబసీ వ్యంగ్య సమాధానం.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ వీడియో షేర్
6
Published: 📅
Reported by: 🖊
Banu Prakash