ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి వేదిక కానుంది. ఏర్పేడు సమీపంలోని ఐజర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) ప్రాంగణంలో డిసెంబరు మొదటి వారంలో 61వ అఖిల భారత డీజీపీల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
దేశ భద్రత, పోలీసింగ్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు నిర్వహించే ఈ సమావేశానికి పలువురు ఉన్నతస్థాయి ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొంటారని సమాచారం.
అలాగే దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర నిఘా సంస్థల అధిపతులు సమావేశానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు, భద్రతా రంగ నిపుణులు ఒకే వేదికపై సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు.
ఈ కాన్ఫరెన్స్‌లో దేశ భద్రత, అంతర్గత భద్రతా సవాళ్లు, పోలీసు వ్యవస్థలో ఆధునిక మార్పులు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సమావేశానికి సుమారు 400 మంది ఐపీఎస్ అధికారులు కూడా హాజరవుతారని అధికారులు వెల్లడించారు.
తిరుపతిలో ఈ స్థాయి జాతీయ సమావేశం నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. సమావేశానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లపై అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
డిసెంబరులో తిరుపతిలో అఖిల భారత డీజీపీల సమావేశం.. హాజరుకానున్న ప్రముఖులు
3
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan