బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల కేసు దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అరెస్టైన నిందితులు మొదట నటుడు సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసినట్లు పోలీసులకు చెప్పినట్టు సమాచారం.
కథనాల ప్రకారం, ముగ్గురు షూటర్లు ముందుగా సల్మాన్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. అయితే అక్కడ పోలీసు భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో దాడి నుంచి వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. అనంతరం తక్కువ భద్రత ఉన్న మరో లక్ష్యాన్ని వెతుకుతూ టైగర్ ష్రాఫ్‌పై దృష్టి పెట్టారని సమాచారం.
టైగర్ ష్రాఫ్ ప్రతి ఆదివారం జుహూ ప్రాంతంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వస్తాడనే సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు కథనం పేర్కొంది. అక్కడ భద్రత తక్కువగా ఉందని భావించి దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు షూటర్లు, బిహార్‌కు చెందిన మరొకరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయుధాల సరఫరాతో సంబంధం ఉందనే అనుమానంతో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు దాడికి బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో చేసిన ప్రకటనల ప్రామాణికతను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
టైగర్ ష్రాఫ్ కాదు.. మొదటి టార్గెట్ సల్మాన్ ఖాన్ అన్న నిందితులు
6
Published: 📅
Reported by: 🖊
Banu Prakash