బాలీవుడ్ నటి కృతి సనన్‌కు సంబంధించిన వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ‘పితృస్వామ్యాన్ని కూల్చేయండి’ వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. అయితే ఆమె రాహుల్ గాంధీకి నేరుగా మాటలతో కౌంటర్ ఇవ్వకుండా, బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన కొన్ని చిత్రాలను రీషేర్ చేశారు.
ఆ చిత్రాల్లో మహిళా రిజర్వేషన్, ట్రిపుల్ తలాక్ వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ గత వైఖరిని ప్రశ్నించేలా సందేశాలు ఉన్నాయి. మహిళల హక్కుల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్న భావన కలిగేలా బీజేపీ ఆ పోస్టులను రూపొందించింది.
కంగనా వాటిని షేర్ చేస్తూ “బ్రో.. కాస్త ఆగు.. భారత్ మాతాకీ జై” అంటూ క్యాప్షన్ జోడించారు. రాహుల్ గాంధీ మహిళల సమస్యలపై మాట్లాడుతున్నప్పటికీ, గతంలో మహిళలకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో కాంగ్రెస్ తీసుకున్న వైఖరిని పరిశీలించాలని ఆమె పరోక్షంగా సూచించారు.
ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, కంగనా స్పందనపై రాజకీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బ్రో.. కాస్త ఆగు: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ కౌంటర్
11