ముంబైలో సంచలనం సృష్టించిన ఘటనలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ద్రోణాచార్య అవార్డు గ్రహీత జిమ్నాస్టిక్స్ కోచ్ గణేశ్ ప్రభాకర్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 45 ఏళ్ల కోచ్‌పై బాలిక ఫిర్యాదు మేరకు విలేపార్లే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బాధిత బాలిక కొన్నేళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో కోచ్ బాలికకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. అనంతరం జిమ్నాసియంకు రావాలని, కలవాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. బాలిక అక్కడికి వెళ్లిన సమయంలో కోచ్ అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
అక్కడి నుంచి బయటపడిన బాలిక అనంతరం కాలేజీకి వెళ్లింది. అయితే ఆమె మానసికంగా కలత చెందినట్లు గుర్తించిన పీఈటీ టీచర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న టీచర్ వెంటనే బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం పోలీసులు ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో సంబంధం ఉన్న వ్యక్తులను విచారిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆరోపణలు నిర్ధారణ కాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ఘటన క్రీడా శిక్షణా కేంద్రాల్లో చిన్నారుల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. యువ క్రీడాకారులు సురక్షిత వాతావరణంలో తమ ప్రతిభను అభివృద్ధి చేసుకునేలా కఠినమైన భద్రతా చర్యలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ద్రోణాచార్య అవార్డు గ్రహీత జిమ్నాస్టిక్స్ కోచ్‌పై పోక్సో కేసు
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk