కర్నూలు నగరంలోని శ్రీనివాస నగర్‌లో వరుస చోరీలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఒకే ప్రాంతంలోని రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడి భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు.
హెడ్ కానిస్టేబుల్ మహేష్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు 23 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
అదే ప్రాంతంలో విశ్రాంత ఆర్‌ఎస్సె సుబ్బయ్య ఇంటినీ దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఇంట్లో నుంచి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు, 5 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.30 వేల నగదును అపహరించారు.
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రెండు చోరీలకు ఒకే ముఠా పాల్పడి ఉండవచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. వరుస చోరీల నేపథ్యంలో రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
కర్నూలులో దొంగల బీభత్సం.. హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో 23 తులాల బంగారం చోరీ
11
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk