అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ కింగ్డమ్ మధ్య పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారానికి కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఏపీ పురపాలక శాఖ, యూకే డిపార్ట్‌మెంట్ ఫర్ బిజినెస్, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ట్రేడ్ మధ్య ఎంఓయూపై సంతకాలు జరిగాయి. పట్టణ ప్రణాళిక, మౌలిక వసతుల అభివృద్ధి, సస్టైనబుల్ సిటీస్ నిర్మాణంపై రెండు దేశాల ప్రతినిధులు చర్చించారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ.. మెరుగైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, ఆధునిక పట్టణాల అభివృద్ధి కోసం యూకే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు రూ.40 వేల కోట్ల విలువైన పనులు చేపడుతున్నామని, వాటిలో అంతర్జాతీయ ప్రమాణాల సాంకేతికతను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఈ ఒప్పందం ద్వారా పట్టణాభివృద్ధి రంగంలో అంతర్జాతీయ అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఏపీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అమరావతి వేదికగా ఏపీ-యూకే కీలక ఒప్పందం.. పట్టణాభివృద్ధి, మౌలిక వసతులపై సహకారం
10
Published: 📅
Reported by: 🖊
Banu Prakash