అనంతపురం జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ధనవంతులు అవుతారని నమ్మించి ఓ మహిళ పేద కుటుంబాన్ని మాయమాటలతో నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూజలు చేస్తే ఐశ్వర్యం వస్తుందని చెప్పి బాలికను, ఆమె కుటుంబ సభ్యులను వేధించినట్లు సమాచారం.
జీవనోపాధి కోసం కళ్యాణదుర్గం నుంచి అనంతపురానికి వచ్చిన ఓ నిరుపేద కుటుంబం ఈ ఘటనకు గురైనట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి అనే మహిళ వారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. హేమంత్ కుమార్ అనే వ్యక్తి కూడా ఈ ఘటనలో భాగమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు బాలికను ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి పూజల పేరుతో వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నెల 9న బాలిక, ఆమె తల్లిని మరోసారి కడపకు తీసుకెళ్లి పూజల పేరుతో ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. అనంతరం మరోసారి కారులో తీసుకువెళ్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాధితులను విడిచిపెట్టి నిందితురాలు పరారైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల వివరాలను సేకరిస్తూ వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ధనవంతులను చేస్తామని నమ్మించి.. బాలికపై దారుణం
3
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla