టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు ముందే భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీ20, వన్డే, టెస్టు సిరీసుల్లో మొత్తం 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల కోసం టికెట్ల విక్రయాలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి.
న్యూజిలాండ్ క్రికెట్ అంతర్జాతీయ సీజన్ టికెట్ ప్రీ సేల్ ప్రారంభమైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగే పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరిగే తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు స్టేడియం పూర్తిగా నిండిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నవంబర్ చివరి నుంచి డిసెంబర్ ప్రారంభం వరకు జరిగే రెండో టెస్టుకు కూడా టికెట్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగే మ్యాచ్‌లపై కూడా అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ గ్లెన్ క్రిచ్లీ మాట్లాడుతూ, భారత పర్యటనపై అభిమానుల్లో ఉన్న ఉత్సాహమే రికార్డు స్థాయి టికెట్ విక్రయాలకు కారణమని తెలిపారు. గత సీజన్ ధరలనే కొనసాగిస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 7 నుంచి సాధారణ టికెట్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
న్యూజిలాండ్‌లో టీమిండియా టూర్‌కు రికార్డు స్థాయి క్రేజ్
1
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati