రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు చరిత్రలో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవంతంగా 49 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలోకి ప్రవేశించింది. 1977లో ప్రారంభమైన ఈ రైలు అప్పటి నుంచి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది.
ప్రారంభ సమయంలో ఈ రైలు మీటర్ గేజీ పట్టాలపై సింగిల్ లైన్‌లో నడిచేది. ప్రయాణికుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకుని తరువాత కాలంలో మార్పులు చేశారు. హైదరాబాద్ నాంపల్లి దక్కన్ నుంచి నిజామాబాద్ వరకు సేవలను విస్తరించారు. అనంతరం ఎక్స్‌ప్రెస్ నుంచి సూపర్‌ఫాస్ట్ రైలుగా అప్‌గ్రేడ్ చేసి ఆధునిక సాంకేతికతతో ప్రయాణం కొనసాగిస్తోంది.
ప్రస్తుతం తిరుపతి నుంచి బయలుదేరే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా సుమారు 890 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తోంది. ఎన్నో కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ రైలుపై ప్రయాణికుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.
మూడు రాష్ట్రాల ప్రజల జీవితాలతో ఈ రైలుకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంత ప్రజలకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఎంతో ఉపయోగకరమైన రవాణా మార్గంగా మారింది. దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఈ రైలు ప్రజల నమ్మకాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది.
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. మూడు రాష్ట్రాలను కలుపుతున్న ప్రజల రైలు
2
Published: 📅
Reported by: 🖊
Kanakadri