అమెరికాలో చదువు, ఉద్యోగం లేదా కెరీర్ కొనసాగించాలని భావిస్తున్న భారతీయులకు వీసా అపాయింట్‌మెంట్‌ల విషయంలో కొత్త అనిశ్చితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని అమెరికా వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసి, కొత్త తేదీలకు రీషెడ్యూల్ చేయనున్నట్లు సమాచారం.
అమెరికా కాన్సులర్ అధికారులకు వీసా దరఖాస్తుల పరిశీలనపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దరఖాస్తుదారులు అమెరికా ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలపై ఆధారపడే అవకాశం ఉందా అనే అంశాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇంటర్వ్యూ తేదీలు పొందిన కొంతమంది దరఖాస్తుదారులకు కూడా అపాయింట్‌మెంట్లు మార్పు చేసినట్లు సమాచారం. కొత్త తేదీలను తరువాత తెలియజేస్తామని వారికి సూచించినట్లు తెలుస్తోంది.
భారతీయులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అమెరికాలో హెచ్-1బీ వీసా పొందుతున్న వారిలో భారతీయుల వాటా గణనీయంగా ఉంది. అలాగే అమెరికా విశ్వవిద్యాలయాల్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. వీసా ఇంటర్వ్యూల ఆలస్యం కారణంగా విద్యార్థుల యూనివర్సిటీ ప్రారంభ తేదీలు, ఉద్యోగుల చేరిక తేదీలు, రీలొకేషన్ ప్రణాళికలు ప్రభావితం కావచ్చు.
అయితే ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు, హెచ్-1బీ వర్క్ వీసాల జారీని పూర్తిగా నిలిపివేయలేదని అధికారులు స్పష్టం
అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు తాత్కాలిక బ్రేక్.. భారతీయ విద్యార్థులు, ఉద్యోగులపై ప్రభావం
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan