నేపాల్‌లో సంభవించిన వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల భద్రతపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం, ఏడుగురిలో నలుగురు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్‌కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మీల కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద శశికుమార్ చివరిసారిగా కనిపించినట్లు సమాచారం అందింది. కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రితో పాటు మరో ముగ్గురు వరదల్లో చిక్కుకున్నప్పటికీ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సురక్షితంగా ఉన్న యాత్రికులను త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. భారత రాయబార కార్యాలయం, చైనా-నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్‌తో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సూచించారు. ఆర్టీజీఎస్ కేంద్రం ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నేపాల్ వరదలు: ఏపీ యాత్రికుల పరిస్థితిపై లోకేశ్ సమీక్ష
1
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk