కాకినాడ నగరంలోని భానుగుడి సెంటర్‌లో అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కోడమాటి సతీష్ రెడ్డి (30) అనే జిమ్ ట్రైనర్‌ను కొందరు వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
స్థానిక వివరాల ప్రకారం, బందుల సాయికిరణ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు సతీష్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో కర్రతో అతని గొంతులో పొడిచినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన సతీష్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న కాకినాడ టూ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత వివాదాలు కారణమై ఉండవచ్చనే అనుమానంతో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల వివరాలు సేకరించి వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
కాకినాడలో జిమ్ ట్రైనర్ దారుణ హత్య.. కర్రతో దాడి చేసి హతమార్చిన దుండగులు
9
Published: 📅
Reported by: 🖊
Sarika Sk