ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక డిజిటల్ ప్రాజెక్ట్ లభించింది. దేశంలో ముంబై, చెన్నై తర్వాత మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా ఏపీ ఎదగనుంది. విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ స్థాయి డిజిటల్ మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు భాగస్వామ్యం కానున్నాయి. విశాఖపట్నంలో గూగుల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌తో పాటు AI, క్లౌడ్ సేవలకు సంబంధించిన ఫెసిలిటీలు అందుబాటులోకి రానున్నాయి. మైక్రోసాఫ్ట్, లైట్‌స్టార్మ్, సింగ్‌టెల్ భాగస్వామ్యంతో సుమారు 3,600 కిలోమీటర్ల పొడవైన I-2SEA సముద్రగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేబుల్ ద్వారా విశాఖపట్నానికి సింగపూర్, ఆగ్నేయాసియా ప్రాంతాలతో నేరుగా కనెక్టివిటీ ఏర్పడనుంది. 2029 చివరి నాటికి ఈ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా మచిలీపట్నం–హైదరాబాద్–ముంబై, చెన్నై–హైదరాబాద్–ముంబై మార్గాల్లో కొత్త అంతర్గత డిజిటల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీంతో విశాఖపట్నం అంతర్జాతీయ డిజిటల్ గేట్‌వేగా మారే అవకాశాలు పెరుగుతున్నాయి. గూగుల్ ఏర్పాటు చేయనున్న AI ఫెసిలిటీలో క్లౌడ్ సేవలు, AI ఇన్ఫరెన్సింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం పునరుత్పాదక విద్యుత్, ఎయిర్ కూలింగ్ టెక్నాలజీలను వినియోగించే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డిజిటల్ రంగంలో కీలక స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది.
Andhra Pradesh to Become India’s Third-Largest Digital Landing Hub
6
Published: 📅
Reported by: 🖊
Sarika Sk