ఢిల్లీలో జరిగిన మోడల్ ముస్కాన్ హత్య కేసులో నిందితుడైన జిమ్ ట్రైనర్ ఇమ్రాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలోని తిలక్‌నగర్‌కు చెందిన 21 ఏళ్ల ముస్కాన్ మోడలింగ్ చేస్తోంది. ఆమెకు ఇమ్రాన్ అనే జిమ్ ట్రైనర్‌తో ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. అయితే ముస్కాన్ మరో యువకుడితో మాట్లాడుతున్న విషయాన్ని ఇమ్రాన్ తట్టుకోలేకపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఇమ్రాన్ ముస్కాన్ ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని, ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. ఆగ్రహానికి గురైన ఇమ్రాన్ కత్తితో ముస్కాన్‌పై దాడి చేశాడు. ఆమెను పలుమార్లు పొడవడంతో ముస్కాన్ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఇమ్రాన్ అక్కడి నుంచి పరారయ్యాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. గురువారం రాత్రి రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో ఇమ్రాన్ పోలీసులకు కనిపించాడు. అతడిని పట్టుకునే సమయంలో ఇమ్రాన్ తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఇమ్రాన్ కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం మెరుగైన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు.
మోడల్ హత్య కేసు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో జిమ్ ట్రైనర్ అరెస్ట్
18
Published: 📅
Reported by: 🖊
Kanakadri