టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానేకు ముంబై క్రికెట్ అసోసియేషన్ అరుదైన గౌరవం అందించనుంది. రహానే పేరిట అర్హులైన యువ క్రికెటర్లకు స్కాలర్‌షిప్ అందించాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది.
ముంబై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీసీఐతో ఒప్పందం లేని పురుష, మహిళా క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే గ్రామీణ, క్షేత్ర స్థాయిలో ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు రహానే పేరిట స్కాలర్‌షిప్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ముంబై జట్టుకు రహానే కెప్టెన్‌గా రంజీ ట్రోఫీ విజయాలు అందించారు. ముంబై క్రికెట్‌కు ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమానికి రహానే పేరు పెట్టినట్లు ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంసీఏ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా కొంత నిధులను అందించనున్నారు.
ఇక ముంబై క్రికెట్ అసోసియేషన్ 22 మంది క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు మంజూరు చేసింది. ఇందులో 14 మంది పురుష ఆటగాళ్లు, 8 మంది మహిళా క్రికెటర్లు ఉన్నారు. గ్రేడ్-ఏ ఆటగాళ్లకు రూ.12 లక్షలు, గ్రేడ్-బి వారికి రూ.8 లక్షలు, గ్రేడ్-సి ఆటగాళ్లకు రూ.6 లక్షల చొప్పున అందించనున్నారు.
అజింక్య రహానేకు అరుదైన గౌరవం.. అతడి పేరిట స్కాలర్‌షిప్
2
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk