బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది కొంత ఊరటనిచ్చే వార్త. శుక్రవారం దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ, ఈరోజు మాత్రం గణనీయమైన తగ్గుదల నమోదైంది.
భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,160 తగ్గి రూ.1,59,820కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,900 తగ్గి రూ.1,46,500 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధరలోనూ భారీ మార్పు చోటుచేసుకుంది. కిలో వెండి ధర రూ.5వేల మేర తగ్గి రూ.2,60,000కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి.
తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,820గా, 22 క్యారెట్ల ధర రూ.1,46,500గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ధరలు తగ్గిన నేపథ్యంలో నగల కొనుగోలుదారులు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిది.
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
1
Published: 📅
Reported by: 🖊
Kanakadri