రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించే అధికారాలను అమెరికా అధ్యక్షుడికి అందించే బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది. 86-11 ఓట్ల భారీ మెజారిటీతో ఈ బిల్లు ఆమోదం పొందింది.దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కీలకంగా వ్యవహరించిన ఈ బిల్లు రష్యా చమురు ఆదాయాన్ని తగ్గించే లక్ష్యంతో రూపొందించినట్లు తెలుస్తోంది.
జులై 28న సెనేట్‌లో ఈ బిల్లుపై ప్రొసీడ్యురల్ ఓటింగ్ నిర్వహించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ కూడా సెనేట్ గ్యాలరీ నుంచి ఈ ప్రక్రియను వీక్షించారు.తాజాగా జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు 86 మంది సభ్యులు మద్దతు తెలపగా, 11 మంది వ్యతిరేకించారు.
బిల్లు చట్టంగా మారితే రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంటుంది.ప్రపంచంలో రష్యా చమురు కొనుగోలు చేసే ప్రధాన దేశాల్లో భారత్, చైనా ఉన్నాయి. దీంతో ఈ బిల్లు అమలైతే ఈ దేశాలపై వాణిజ్య ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.అయితే తమ అవసరాల్లో పరిమిత స్థాయిలో మాత్రమే రష్యా నుంచి దిగుమతులు చేసుకునే దేశాలకు కొన్ని మినహాయింపులు ప్రతిపాదించారు.రష్యా చమురు ఆదాయమే ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక ఆధారంగా మారిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పలుమార్లు ఆరోపించారు.ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, సైనిక అధికారులపై మరిన్ని ఆంక్షలు విధించే అంశాలు కూడా బిల్లులో ఉన్నాయి.అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ఇతర పేర్లతో పనిచేస్తున్న ఆయిల్ ట్యాంకర్లపై చర్యలు తీసుకునే నిబంధనలు కూడా ఇందులో పొందుపరిచారు.
రష్యా చమురుపై అమెరికా కఠిన చర్యలు.. భారత్‌కు ప్రభావం?
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan