కృష్ణా నది ఉధృతంగా ప్రవహించడంతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 2,57,059 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుండగా, అందులో 2,11,331 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరినట్లు అధికారులు తెలిపారు.శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 874.70 అడుగులకు చేరింది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 162.8190 టీఎంసీల నీరు నిల్వ ఉంది.మరో మూడు రోజుల్లో నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తి ప్రారంభమైంది.భారీ వరద ప్రవాహం నేపథ్యంలో శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.ఎడమ గట్టు తెలంగాణ జలవిద్యుత్ కేంద్రంలో 21,189 క్యూసెక్కుల నీటితో 7.319 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు.కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 9,603 క్యూసెక్కుల నీటిని వినియోగించి 1.684 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు.శ్రీశైలం నుంచి దిగువ ప్రాంతాలకు కూడా నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్‌కు 30,792 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.
వరద పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
శ్రీశైలానికి భారీ వరద.. 200 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan