హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కనిపించిందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీ ప్రాంగణంలోని ఓ ప్రాంతంలో ఈ మొక్కను సిబ్బంది గుర్తించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థులు, సిబ్బంది మధ్య ఈ విషయం తీవ్ర చర్చకు దారితీసింది.
క్యాంపస్‌లో గంజాయి మొక్క ఎలా పెరిగింది? సహజంగానే మొలిచిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నాటారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై యూనివర్సిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా సంబంధిత ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా అక్కడ గంజాయి మొక్క కనిపించలేదని పేర్కొన్నారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఆ మొక్కను తొలగించినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా మొక్క అక్కడికి ఎలా వచ్చింది, ఎవరి ప్రమేయం ఉందా అనే అంశాలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో కారణంగా ఈ ఘటనకు ప్రాధాన్యం పెరిగింది. యూనివర్సిటీ వంటి విద్యాసంస్థ ప్రాంగణంలో ఇలాంటి మొక్క కనిపించిందన్న వార్త భద్రతా పర్యవేక్షణపై కూడా చర్చకు దారితీసింది.
ఓయూ క్యాంపస్‌లో గంజాయి మొక్క కలకలం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
0