ఏఐ మ్యూజిక్ స్టార్టప్ సునో తమ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటివరకు ఏఐ సహాయంతో పాటలు సృష్టించుకునే అవకాశం కల్పించిన సునో, ఇప్పుడు పద్యాలు, ప్రసంగాలు, వాయిస్ కంటెంట్‌కు తగిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను జోడించే సదుపాయాన్ని తీసుకొచ్చింది.
యూజర్లు స్వయంగా రాసుకున్న పద్యం లేదా మాట్లాడిన కంటెంట్‌ను సునోలో ఉపయోగించి, దానికి సరిపోయే సంగీతాన్ని ఏఐ ద్వారా రూపొందించుకోవచ్చు. సంగీతంపై ప్రత్యేక శిక్షణ లేకపోయినా ఈ టూల్ ద్వారా వినసొంపైన ఆడియో కంటెంట్‌ను తయారు చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. క్రియేటర్లకు అవసరమైన వివిధ రకాల ఎంటర్‌టైన్‌మెంట్ టూల్స్‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందించాలన్న లక్ష్యంతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు సునో సహవ్యవస్థాపకుడు మైకీ షుల్మన్ తెలిపారు.
సంగీత పరిజ్ఞానం లేని సాధారణ యూజర్లు కూడా తమ ఆలోచనలను పాటలుగా, మ్యూజిక్‌తో కూడిన వాయిస్ కంటెంట్‌గా మార్చుకోవడం వల్ల సునోకు ఆదరణ పెరుగుతోంది. సంస్థ మార్కెట్ విలువ కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే సునోపై కాపీరైట్‌కు సంబంధించిన న్యాయవివాదాలు కూడా కొనసాగుతున్నాయి. అనుమతి లేకుండా కాపీరైట్ కంటెంట్‌తో ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చిందనే ఆరోపణలపై పలు ప్రముఖ మ్యూజిక్ సంస్థలు కేసులు వేశాయి. వార్నర్ మ్యూజిక్‌తో వివాదం సెటిల్ అయినప్పటికీ, మరికొన్ని సంస్థలతో వివాదాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ భవిష్యత్తు సంగీత రంగంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని సునో భావిస్తోంది.
ఏఐ మ్యూజిక్ యాప్ సునో నుంచి కొత్త టూల్.. మాటకు మ్యూజిక్ టచ్
0
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati