రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సరైన సమయంలో వైద్యం అందితే అనేక ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారు. ఈ సమయంలో అత్యవసర చికిత్స అందితే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
PM Rahat అంటే Road Accident Victim Hospitalization and Assured Treatment. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదానికి గురైన ప్రతి బాధితుడికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందించనున్నారు. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, పట్టణ లేదా గ్రామీణ రహదారి అనే తేడా లేకుండా దేశంలోని ఏ రోడ్డుపై ప్రమాదం జరిగినా ఈ సదుపాయం వర్తిస్తుందని వివరించారు.
ఈ పథకం కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు. ఆసుపత్రిలో బాధితుడి ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రం ద్వారా గుర్తింపును ధ్రువీకరించి చికిత్స అందిస్తారు.
ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు లేదా సంఘటన స్థలంలో ఉన్న వారు 112 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. అక్కడి నుంచి అంబులెన్స్ సహాయం, సమీపంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రుల వివరాలు పొందవచ్చు. చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా చెల్లిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వైద్యం అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
రోడ్డు ప్రమాద బాధితులకు భరోసా.. పీఎం రాహత్ కింద రూ.1.50 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స
0
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla