సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గ్రూప్-B నాన్ గెజిటెడ్ కేడర్‌లో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
2026 సెప్టెంబర్ 1 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇంగ్లీష్‌లో నిమిషానికి కనీసం 35 పదాల టైపింగ్ వేగం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో నిర్వహించనున్నారు. మొదట 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, న్యాయవ్యవస్థకు సంబంధించిన రాజ్యాంగ అంశాలు, సుప్రీంకోర్టు రూల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కులు ఉంటాయి.
తర్వాత 50 మార్కులకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, 100 మార్కులకు డిస్క్రిప్టివ్ రాత పరీక్ష, చివరగా 25 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి రూ.35,400 ప్రాథమిక వేతనంతో పాటు వర్తించే అలవెన్సులు అందుతాయి.
ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 7, 2026 నుంచి ప్రారంభమై అక్టోబర్ 28తో ముగుస్తాయి. ఆబ్జెక్టివ్ పరీక్ష నవంబర్ 20న నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీతో అవకాశం
0
Published: 📅
Reported by: 🖊
Kanakadri