నార్త్‌ఈస్ట్ ఢిల్లీ జిల్లాలో సోమవారం పోలీసులు, ఇద్దరు అనుమానిత గ్యాంగ్ సభ్యుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మొహమ్మద్ కైఫ్, మొహమ్మద్ జసీమ్ అనే ఇద్దరు నిందితులు గాయపడ్డారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కైఫ్, జసీమ్ ఉస్మాన్‌పూర్‌లోని తమ ఇంటికి చేరుకునేందుకు అటవీ ప్రాంతం మీదుగా వెళ్లనున్నారనే సమాచారం నార్త్‌ఈస్ట్ ఢిల్లీ జిల్లా స్పెషల్ స్టాఫ్ పోలీసులకు అందింది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో మాటు వేశారు. ఇద్దరు అనుమానితులు అక్కడికి చేరుకున్న సమయంలో పోలీసులను చూసి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో కైఫ్, జసీమ్‌ల ఎడమ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నిందితులు ఇద్దరు పోలీసు సిబ్బందిపై కూడా కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే బుల్లెట్లు పోలీసుల బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను తాకడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.
అరెస్టైన ఇద్దరికీ నార్త్‌ఈస్ట్ ఢిల్లీకి చెందిన రషీద్ కేవల్‌వాలా గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ నాయకుడు రషీద్ కేవల్‌వాలాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కైఫ్, జసీమ్ నేరచరిత్ర, గ్యాంగ్‌తో వారి సంబంధాలు, ఇతర నేరాల్లో వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు
4
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk