ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) పరిధిలోని క్రీడా ప్రాంగణాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని నిషేధించారు. గత నెల 18న ప్రారంభమైన ఈ కార్యక్రమం నెల రోజుల పాటు ఢిల్లీలోని పార్కులు, క్రీడా ప్రాంగణాలు, రీక్రియేషనల్ కేంద్రాల్లో కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఆదివారం ఒక్కరోజే డీడీఏకు చెందిన క్రీడా ప్రాంగణాల్లో 2.5 టన్నుల చెత్తను సేకరించినట్లు వెల్లడించారు. చెత్తను సక్రమంగా నిర్వహించేందుకు వాటర్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయడంతో పాటు తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు గ్రీన్, బ్లూ చెత్త డబ్బాలను ఏర్పాటు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పారిశుద్ధ్య పనులు చేపట్టడం, మొక్కలు నాటడం, పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజలను కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు.
సాకేత్, నేతాజీ సుభాష్, హరి నగర్, పశ్చిమ్ విహార్, ద్వారకా, మేజర్ ధ్యాన్ చంద్ తదితర స్పోర్ట్స్ కాంప్లెక్సులతో పాటు పలు క్రీడా, గోల్ఫ్ ప్రాంగణాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త డబ్బాలు నిండిపోకుండా ‘బిన్ బిఫోర్ ఓవర్‌ఫ్లో’ కార్యక్రమం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పబ్లిక్ టాయిలెట్లు, రీక్రియేషనల్ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం ‘క్యాపిటల్ ప్రామిస్’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
ఢిల్లీ స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk