విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.
అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో దుర్గగుడి అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందించారు.
దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు సీఎంను కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాన్ని అందించి ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేశారు.
అనంతరం దసరా మహోత్సవాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని, దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈఓ శీనా నాయక్, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొని సీఎంకు ఆహ్వానం అందించారు.
ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రవాణా, భద్రత, దర్శన ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలకు రండి.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
3
Published: 📅
Reported by: 🖊
Sarika Sk