విదేశాల్లో ఉద్యోగం చేస్తూ కుటుంబాలకు అండగా నిలిచిన ఇద్దరు భారతీయ యువకులు వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్ వర్మ (26), వినయ్ యాదవ్ (23) అక్కడ యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు.
ఈ నెల 25న యోగా క్లాసులు ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వర్షం కారణంగా రోడ్లు తడిగా ఉండడంతో బైక్ జారి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రాంచీకి చెందిన రాజ్‌కుమార్ వర్మ అక్కడికక్కడే మృతి చెందారు. జంషెడ్‌పూర్‌కు చెందిన వినయ్ యాదవ్ తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయారు.
ఇద్దరూ గత రెండేళ్లుగా వియత్నాంలో యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న సమయంలో జరిగిన ఈ విషాదంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడం కుటుంబాలకు ఆర్థిక భారంగా మారిన నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ తెలిపారు. మృతదేహాలను త్వరగా జార్ఖండ్‌కు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
విదేశాల్లో ఉద్యోగం చేస్తూ మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.
వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ యోగా శిక్షకుల మృతి
6
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati