ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కోపైలట్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు.
మచార్ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ధైర్యంగా పోరాడి విమానంలో ఉన్న వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారని వారు పేర్కొన్నారు. మోదీ మచార్‌ను హీరోగా అభివర్ణిస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నెతన్యాహు కూడా మచార్‌కు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ సైతం ఆయనను నిజమైన హీరోగా అభివర్ణించారు.
కథనం ప్రకారం.. ఫ్లైదుబాయ్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం బుధవారం ఉదయం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరింది. విమానంలో మొత్తం 174 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 166 మంది ఇజ్రాయెల్ పౌరులు. విమానం 31 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఒమన్‌కు చెందిన కోపైలట్ స్మిత్ మచార్‌పై కత్తితో దాడి చేసినట్లు కథనం తెలిపింది.
విమానాన్ని కూల్చేందుకు కోపైలట్ ప్రయత్నించగా మచార్ తీవ్రంగా ప్రతిఘటించినట్లు పేర్కొంది. ఆయన అరుపులు విన్న విమాన సిబ్బంది, ప్రయాణికులు కాక్‌పిట్ వద్దకు చేరుకుని కోపైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సమయంలో విమానం 31 వేల అడుగుల నుంచి 14 వేల అడుగుల ఎత్తుకు దిగిపోయినట్లు కథనం తెలిపింది. ప్రయాణికుల్లో ఉన్న మరో ఇద్దరు పైలట్లు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
భారత పైలట్ స్మిత్ మచార్‌పై మోదీ, ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు
3
Published: 📅
Reported by: 🖊
Banu Prakash