టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై చర్చ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో, అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరనే ప్రశ్నకు మాజీ భారత ఓపెనర్ వసీమ్ జాఫర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. యువ బ్యాటర్ తిలక్ వర్మకు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉందని జాఫర్ పేర్కొన్నాడు.
తిలక్ వర్మకు బ్యాటింగ్‌లో మంచి బహుముఖ ప్రజ్ఞ ఉందని జాఫర్ చెప్పాడు. నంబర్-3 స్థానంలో ఇప్పటికే సెంచరీ చేసిన తిలక్.. ప్రస్తుతం నంబర్-5, 6 స్థానాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడని వివరించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమైన తర్వాత టాప్ ఆర్డర్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేందుకు యశస్వి జైస్వాల్ వంటి ఆటగాడు ఉన్నాడని, అయితే కోహ్లీ స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ రావడం ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాడు. దులీప్ ట్రోఫీలో తిలక్ వర్మ ప్రదర్శన, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో దాదాపు 55 బ్యాటింగ్ సగటు అతడి ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ తిలక్ సులభంగా సరిపోతాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
అయితే తిలక్ వర్మ ఇప్పటివరకు భారత్ తరఫున కేవలం నాలుగు వన్డేలు మాత్రమే ఆడాడు. ఇందులో 68 పరుగులు సాధించాడు.
ఆ సామర్థ్యం అతడికే ఉంది.. వన్డేల్లో కోహ్లీ వారసుడు తిలక్ వర్మ?
10