అమెరికాలో 2026 మిడ్‌టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వృద్ధులకు Medicare ప్రీమియం భారం తగ్గించేలా కొత్త ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అర్హులైన Medicare Part B లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 90 డాలర్ల చొప్పున ఒకసారి చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 20 మిలియన్లకు పైగా వృద్ధులకు ప్రయోజనం కలుగుతుందని వైట్ హౌస్ పేర్కొంది. ఇందుకు Medicare Improvement Fund నుంచి నిధులు వినియోగించనున్నారు. చాలా మందికి అక్టోబర్‌లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కానుండగా, మరికొందరికి చెక్కులు పంపనున్నారు.
ఇంతకుముందు ట్రంప్ ప్రభుత్వం Affordable Care Act మార్కెట్‌ప్లేస్‌కు సంబంధించిన అదనపు ఫీజుల రిఫండ్ పేరుతో అర్హులైన దాదాపు 10 లక్షల మందికి ఒక్కొక్కరికి 500 డాలర్లు చెల్లించే కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఆ చెల్లింపులు 30 రాష్ట్రాల్లోని అర్హులైన వినియోగదారులకు అందనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.
ఇక రిపబ్లికన్లు కాంగ్రెస్‌లో నియంత్రణ కొనసాగిస్తే ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్లు చెల్లిస్తానని ట్రంప్ మరో ప్రతిపాదన చేశారు. అయితే ఈ పథకానికి ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా వ్యయం కావచ్చని అంచనాలు ఉన్నాయి. దీనిని అమలు చేయడానికి కాంగ్రెస్ ఆమోదం అవసరమని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ పేర్కొన్నారు.
మిడ్‌టర్మ్ ఎన్నికల వేళ వృద్ధులకు ట్రంప్ $90 మెడికేర్ రిబేట్
0
Published: 📅
Reported by: 🖊
Kanakadri