ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య భవిష్యత్‌పై చర్చ కొనసాగుతోంది. వచ్చే సీజన్‌కు ముందు హార్దిక్‌ను మరో జట్టుకు ట్రేడ్ చేసే అవకాశాలపై పలు వార్తలు వస్తున్నాయి.చెన్నై సూపర్ కింగ్స్ లేదా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో హార్దిక్ ట్రేడ్ జరగవచ్చన్న ప్రచారం నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అశ్విన్ అభిప్రాయం ప్రకారం.. హార్దిక్‌ను కేకేఆర్‌కు ట్రేడ్ చేస్తే ముంబై ఇండియన్స్ ప్రతిగా హర్షిత్ రాణా, రింకు సింగ్ ఇద్దరినీ తీసుకోవాలని సూచించాడు.కేకేఆర్ నుంచి సరైన ఆటగాళ్లను పొందితే ముంబై భవిష్యత్ జట్టును మరింత బలంగా నిర్మించుకోవచ్చని అశ్విన్ పేర్కొన్నాడు.అదే సమయంలో హార్దిక్ కేకేఆర్‌లో చేరితే ఆ జట్టు బ్యాటింగ్ విభాగం మరింత బలపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.హార్దిక్ కేవలం కేకేఆర్ లేదా సీఎస్కేలోనే చేరతాడని భావించాల్సిన అవసరం లేదని అశ్విన్ పేర్కొన్నాడు.సీఎస్కే నుంచి శివమ్ దూబెతో పాటు మరో పేసర్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ ఉందని తెలిపాడు. అయితే ఏ ట్రేడ్ జరిగినా ముంబై తన దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించాడు.హార్దిక్ పాండ్య 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ముంబైతో పలు విజయాల్లో భాగమైన తర్వాత 2022 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు మారాడు.గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే హార్దిక్ నాయకత్వంలో టైటిల్ సాధించింది. అనంతరం ముంబై ఇండియన్స్ అతడిని తిరిగి జట్టులోకి తీసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.అయితే ముంబైకి ఆశించిన ఫలితాలు రాలేదు. 2024లో జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 2025లో క్వాలిఫయర్-2 వరకు చేరుకున్నప్పటికీ, 2026 సీజన్‌లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.