సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (SCoR) తక్కువ సమయంలోనే గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన జోన్‌గా నిలిచిందని తెలిపింది.ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి భారీ స్థాయిలో పనులు కొనసాగుతున్నాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం రూ.54,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు అమల్లో ఉండగా, మరో రూ.71,000 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించింది.విశాఖపట్నం రైల్వే యార్డ్ ఆధునికీకరణ కోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. పునర్నిర్మాణంలో భాగంగా ఆరు కొత్త ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొంది.గుంతకల్-బళ్లారి నాలుగు లైన్ల విస్తరణకు రూ.1,205 కోట్లు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. రైళ్ల భద్రత కోసం 100 ఇంజిన్లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.విశాఖపట్నం రైల్వే యార్డ్ పునర్నిర్మాణానికి రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.ఈ ఆధునికీకరణలో భాగంగా ఆరు కొత్త ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, రైళ్ల నిర్వహణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొంది.విజయవాడ డివిజన్ పరిధిలో రైల్వే అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్రం తెలిపింది.ఐదు కొత్త రైల్వే మార్గాలు, 24 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించింది.గుంతకల్-బళ్లారి నాలుగు లైన్ల విస్తరణ కోసం రూ.1,205 కోట్లు కేటాయించినట్లు తెలిపింది.
విశాఖ రైల్వే జోన్ రికార్డు.. రూ.2,493 కోట్ల ఆదాయంతో అగ్రస్థానం
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan