దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ, వాతావరణ సదస్సు ప్రారంభమైంది. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ పేరుతో నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు. ఈ సదస్సును జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్‌జీటీ) సెప్టెంబర్ 19, 20 తేదీల్లో నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు 17 దేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘పీఎం సూర్యఘర్’ పథకం విజయవంతమైందని తెలిపారు. దేశంలో 50 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆధునిక వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలను అందిస్తోందని అన్నారు. అలాగే భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను అనవసరంగా నిందిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల తలసరి కర్బన ఉద్గారాలు భారత్‌తో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పర్యావరణ, వాతావరణ సవాళ్లపై ఈ సదస్సులో విస్తృత చర్చలు జరగనున్నాయి. పర్యావరణ విధానాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ, వాతావరణ న్యాయం, జీవవైవిధ్యం, పర్యావరణ చట్టాలు, పునరుత్పాదక ఇంధనం, అడవుల పరిరక్షణ వంటి అంశాలపై సాంకేతిక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ప్రారంభం.. ప్రారంభించిన ప్రధాని మోదీ
0
Published: 📅
Reported by: 🖊
Kanakadri