అమరావతి: ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వేసవిని తలపించే ఎండల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్, ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరిందని వెల్లడించారు.
విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. థర్మల్ పవర్ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచామని తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తున్నామని చెప్పారు. వర్షాలు లేకపోవడంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని వివరించారు.
ప్రజలకు, వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ డిమాండ్ 20 శాతం పెరిగిందన్నారు. అవసరాలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పగటిపూట సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి బ్యాటరీల్లో నిల్వ చేసి, పీక్ అవర్స్‌లో వినియోగించే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. 5500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
విద్యుత్ శాఖపై ఎల్‌నినో ప్రభావం.. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan