విజయవాడ, సెప్టెంబర్ 16: ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా 25 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేసినట్లు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విభాగాల్లో కలిపి ఇప్పటి వరకు 359 ఉద్యోగాలను కల్పించామని మంత్రి తెలిపారు. ప్రత్యేక కేసు కింద 35 మందిని నియమించినట్లు చెప్పారు. రాత్రింబవళ్లు పనిచేసే విద్యుత్ శాఖలో సిబ్బంది భద్రత కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు సూర్యఘర్ పథకం కింద సోలార్ పవర్ అందించామని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. విద్యుత్ రంగ అభివృద్ధితో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు
విద్యుత్ శాఖలో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి గొట్టిపాటి
1
Published: 📅
Reported by: 🖊
Kanakadri