ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన ఫామ్‌ను చాటుకున్నాడు. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు.
మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో సంజూకు ఓపెనింగ్ స్థానాల కోసం తనకు, అభిషేక్ శర్మకు, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మధ్య పోటీపై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన సంజూ.. వైభవ్, అభిషేక్ తన పోటీదారులు అనేది కేవలం బయటి ప్రపంచం అభిప్రాయం మాత్రమేనని అన్నాడు. తామంతా ఒకే టీమ్‌గా దేశం కోసం ఆడుతున్నామని స్పష్టం చేశాడు.
ఒక ఆటగాడికి అవకాశం రాకపోతే మరో ఆటగాడికి ఎందుకు ఇచ్చారంటూ బాధపడటం లేదా ప్రతికూల ఆలోచనల్లో ఉండటం జట్టుకు ఉపయోగపడదని సంజూ పేర్కొన్నాడు. ముందుగా మ్యాచ్‌లో విజయం సాధించడమే తమ లక్ష్యమని తెలిపాడు.
సోషల్ మీడియాలో జరిగే చర్చలను తాను పెద్దగా పట్టించుకోనని సంజూ చెప్పాడు. అయితే కొన్నిసార్లు మాజీ ఆటగాళ్ల వ్యాఖ్యలు తన దృష్టికి వస్తాయని తెలిపాడు. బయటి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఆటగాడు తన లక్ష్యం, సన్నద్ధత, మైదానంలోని మానసిక స్థితిపై దృష్టి పెట్టాలని సూచించాడు. అనుభవం పెరిగేకొద్దీ విమర్శలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానని సంజూ పేర్కొన్నాడు.
పోటీ బయటి ప్రపంచానిదే.. మేమంతా ఒకే జట్టు: సంజూ శాంసన్
1
Published: 📅
Reported by: 🖊
Sarika Sk