ఇంటర్నెట్ డెస్క్: అలస్కాకు చెందిన 15 ఏళ్ల బాలుడు డెరెక్ పార్కర్ అద్భుతంగా ప్రాణాలతో బయటపడిన ఘటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన అన్న, మరో కజిన్‌తో కలిసి పసిఫిక్ మహాసముద్రంలో బోటులో షికారుకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. అనుకోకుండా బోటు తలకిందులు కావడంతో డెరెక్ మినహా మిగతా ఇద్దరూ మృతి చెందారు. డెరెక్ మాత్రం 62 గంటల పాటు సముద్రంలో ఒంటరిగా గడిపాడు.
బోటు పైభాగంపై కూర్చుని దాదాపు మూడు రోజులు గడ్డకట్టే నీటిలో వణుకుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. తన అన్న, కజిన్‌ల మృతదేహాలను కొన్ని గంటల పాటు పట్టుకుని ఉన్నాడని వివరించారు. అనంతరం కోస్ట్ గార్డ్‌కు సమాచారం అందడంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బాలుడిని హెలికాప్టర్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు.
బెరింగ్ సముద్రంలో తూర్పు వైపు నాలుగు మైళ్ల దూరంలో డెరెక్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బోటులో ఫిషింగ్ లైన్ చిక్కుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బోటు తిరగబడినట్లు చెప్పారు.
62 గంటలు సముద్రంలో ఉండటంతో డెరెక్ తీవ్ర డీహైడ్రేషన్‌కు గురయ్యాడని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు. అతను హైపోథర్మియాకు గురైనట్లు వెల్లడించారు.
62 గంటలు సముద్రంలో ఒంటరిగా.. మృత్యుంజయుడిగా బయటపడిన బాలుడు
2
Published: 📅
Reported by: 🖊
Banu Prakash