ఇంటర్నెట్ డెస్క్: రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం టారిఫ్‌లు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుపై అమెరికా ప్రతినిధుల సభ (యూఎస్ హౌస్) ఓటు వేయనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే అలాంటి దేశాలపై సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లభిస్తుంది. ఈ టారిఫ్‌లు విధించే అవకాశం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉందని కథనం పేర్కొంది.
‘లిండ్‌సే ఓ గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ పేరుతో ఉన్న ఈ బిల్లును యూఎస్ సెనేట్ ఇప్పటికే 86-11 ఓట్లతో ఆమోదించింది. రష్యా, ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించడం, రష్యా ఇంధన ఆదాయాలపై ఒత్తిడి పెంచడం ఈ బిల్లు లక్ష్యాల్లో భాగంగా ఉన్నాయి.
అయితే ఈ బిల్లు యూఎస్ హౌస్‌లో ఆమోదమైనంత మాత్రాన భారత వస్తువులపై వెంటనే 100 శాతం సుంకాలు అమలులోకి వస్తాయని భావించరాదు. అధ్యక్షుడికి అలాంటి టారిఫ్‌లు విధించే అధికారం మాత్రమే కల్పించే అవకాశం ఉంటుందని కథనం తెలిపింది.
సెనేట్ ఆమోదించిన వెర్షన్‌లో భారత్ లేదా ఇతర దేశాల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. రష్యా నుంచి అధిక స్థాయిలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే దేశాలకు వర్తించే విధంగా విస్తృత విధానాన్ని అందులో పొందుపరిచారు.
రష్యా చమురు కొనుగోలు దేశాలపై 100 శాతం టారిఫ్‌లు.. యూఎస్ హౌస్‌లో బిల్లుపై ఓటింగ్
2
Published: 📅
Reported by: 🖊
Sarika Sk