అమరావతి, సెప్టెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోలీస్ శాఖలో మొత్తం 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 378 ఎస్ఐ పోస్టులు, 1,156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులను అధికారిక APSLPRB వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమిక రాత పరీక్ష తేదీని ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో వెల్లడించనుంది.
ఈ నియామకాల్లో SI (SPF), SCT SI (కమ్యూనికేషన్), SI (PTO), సైంటిఫిక్ అసిస్టెంట్ (FSL), PC (సివిల్/AR), ఫైర్‌మెన్, వార్డర్, PC (కమ్యూనికేషన్), PC (మెకానిక్స్, డ్రైవర్లు) వంటి పోస్టులు ఉన్నాయి.
పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ ద్వారా యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అభ్యర్థులు దరఖాస్తు తేదీలు, అర్హతలు, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఏపీ పోలీస్ శాఖలో భారీ నియామకాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
7
Published: 📅
Reported by: 🖊
Kanakadri