ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి మరోసారి గాయం ఎదురైంది. దీంతో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. తొలి టీ20 మ్యాచ్‌లో మూడో ఓవర్ వేస్తున్న సమయంలో పక్కటెముకలకు గాయం అయినట్లు బీసీసీఐ వెల్లడించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జపాన్ వేదికగా సెప్టెంబర్ 28 నుంచి జరగనున్న ఆసియా క్రీడల్లోనూ వరుణ్ పాల్గొనే అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది.
గాయం కారణంగా రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న వరుణ్ చక్రవర్తి ఇటీవలే తిరిగి మైదానంలోకి వచ్చాడు. మళ్లీ ఫామ్ అందుకుంటున్న సమయంలోనే గాయపడటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
అయితే వరుణ్ స్థానంలో ఆసియా క్రీడల జట్టుకు ఇప్పటివరకు అధికారికంగా ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించలేదు. జట్టులో రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ ప్రధాన స్పిన్ ఎంపికలుగా ఉన్నారు. అక్షర్ పటేల్ కూడా మరో స్పిన్ ఆప్షన్‌గా అందుబాటులో ఉన్నాడు. మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే వరుణ్ లేకపోవడం భారత జట్టుకు నష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక టీమిండియాను గాయాల సమస్య వెంటాడుతోంది. ఇప్పటికే హర్షిత్ రాణా అఫ్గానిస్థాన్ సిరీస్‌తో పాటు ఆసియా క్రీడలకు దూరమయ్యాడు. అతడి స్థానంలో యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు.
ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. సెమీ ఫైనల్స్ అక్టోబర్ 1న, ఫైనల్ అక్టోబర్ 3న జరగనున్నాయి.
తిరగబెట్టిన గాయం.. ఆసియా క్రీడలకూ వరుణ్ చక్రవర్తి దూరం
1
Published: 📅
Reported by: 🖊
Kanakadri