ఇంటర్నెట్ డెస్క్: వినాయక చవితి అంటే కేవలం గణనాథుడి ఆగమనం మాత్రమే కాదు.. నిమజ్జనంతో ముగిసే ఆధ్యాత్మిక వేడుక కూడా. భక్తులు పూజలు, భజనలు, హారతులతో కొలిచిన వినాయకుడిని అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. ఈ సంప్రదాయం వెనుక పురాణ విశ్వాసాలతో పాటు జీవితంలో ప్రతి వస్తువూ తాత్కాలికమే అనే తాత్విక భావన ఉందని చెబుతారు.
వినాయకుడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి కొద్దిరోజుల పాటు పూజించిన అనంతరం నిమజ్జనం నిర్వహిస్తారు. విగ్రహం పంచభూతాల్లో కలిసిపోతుందని భక్తుల విశ్వాసం. భౌతిక రూపం తాత్కాలికమైనప్పటికీ, ఆధ్యాత్మిక శక్తి శాశ్వతమనే భావన ఇందులో ఉందని కథనం పేర్కొంది. నిమజ్జనం సమయంలో “గణపతి బప్పా మోరియా” అంటూ భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలుకుతారు.
పురాణ కథనం ప్రకారం, మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని చెబుతుండగా గణేశుడు దానిని లిఖించారు. ఈ ప్రక్రియ పది రోజుల పాటు కొనసాగిందని, అనంతరం గణేశుడికి సరస్సులో స్నానం చేయించడంతో ఆయన శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చిందనే విశ్వాసం ఉంది. అప్పటి నుంచి పది రోజుల పూజ అనంతరం వినాయక నిమజ్జనం చేసే సంప్రదాయం కొనసాగుతోందని చెబుతారు.
కుటుంబ, ప్రాంతీయ సంప్రదాయాల ప్రకారం ఒక రోజు నుంచి పది రోజుల వరకు వినాయకుడిని పూజించి నిమజ్జనం చేస్తారు. అనంత చతుర్దశి రోజున జరిగే నిమజ్జనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని భక్తులు భావిస్తారు.
వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే
10
Published: 📅
Reported by: 🖊
Banu Prakash