మహబూబాబాద్: డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ఎలాంటి గాయాలు లేకుండా బయటపడగా, ఆయన డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ మహబూబాబాద్ కలెక్టరేట్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో చింతపల్లి వద్దకు చేరుకున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారులో మంటలు వ్యాపించాయి. పవర్ బ్యాంక్ పేలడంతో వాహనం కేబిన్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం.
ప్రమాదాన్ని గుర్తించిన ఎమ్మెల్యే, ఆయన సిబ్బంది వెంటనే అప్రమత్తమై వాహనం నుంచి బయటకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందించారు. అనంతరం రాంచంద్ర నాయక్ మరో వాహనంలో మహబూబాబాద్ కలెక్టరేట్‌కు వెళ్లారు.
ఎమ్మెల్యే కారులో మంటలు చెలరేగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆయన సురక్షితంగా బయటపడిన విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ కారులో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
3
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati