దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. దిశా సాలియన్ తండ్రి సతీశ్ సాలియన్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు రూ.500 కోట్ల పరువు నష్టం నోటీసులు పంపినట్లు వార్తలు వెలువడ్డాయి.
తన కుమార్తె మరణంపై న్యాయం కోసం చేస్తున్న పోరాటాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా చూపుతూ వ్యాఖ్యలు చేశారని సతీశ్ సాలియన్ నోటీసులో ఆరోపించారు. ఆదిత్య ఠాక్రే, అనిల్ దేశ్‌ముఖ్‌లు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఏడు రోజుల్లో ఎలాంటి షరతులు లేని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ క్షమాపణలను ప్రధాన ముద్రణ, టెలివిజన్, డిజిటల్ మీడియా వేదికల్లో ప్రచురించాలని కోరారు.
డిమాండ్లు నెరవేర్చకపోతే సివిల్ పరువు నష్టం కేసుతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఓ భవనం నుంచి పడిపోయి దిశా సాలియన్ మరణించారు. అప్పట్లో ముంబై పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు. అనంతరం కేసు దర్యాప్తు అంశం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
దిశా సాలియన్ కేసు: ఆదిత్య ఠాక్రే, అనిల్ దేశ్‌ముఖ్‌లకు రూ.500 కోట్ల పరువు నష్టం నోటీసు
0
Published: 📅
Reported by: 🖊
Sarika Sk